Ratna Printing Works
తెలుగు

నాలుగు దశాబ్దాల నిరంతర కృషి

1982లో ప్రారంభమైన ‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ ప్రస్థానం - నాణ్యత, సాంకేతికత, నమ్మకం, విశ్వసనీయ సేవ అనే విలువలతో నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది.

ప్రింటింగ్ రంగంపై చిన్ననాటి నుంచే ఆసక్తి గల యజమాని, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అందిపుచ్చుకోవాలనే తపన, ఖాతాదారుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి - ఇవే ‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ అభివృద్ధికి ప్రధాన బలాలు.

40+
దశాబ్దాల ప్రయాణం
1982
ప్రస్థానం ప్రారంభం
నాణ్యత
నమ్మకమే చిరునామా
1982

స్క్రీన్ ప్రింటింగ్‌తో ప్రారంభం

‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ ప్రస్థానం 1982లో స్క్రీన్ ప్రింటింగ్‌తో ప్రారంభమైంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ప్రింటింగ్ రంగంలో నైపుణ్యం సాధించాలనే లక్ష్యంతో శ్రీ ముత్యాల రామారావు చెన్నై వెళ్లి స్క్రీన్ ప్రింటింగ్‌లో శిక్షణ పొందారు. అక్కడ ప్రముఖ సంస్థలైన *‘రైజింగ్ స్క్రీన్స్’, ‘కోయా స్క్రీన్స్’* లో కొంతకాలం పనిచేసి, ఆ రంగంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రాక్టికల్ అనుభవాన్ని సంపాదించారు.

శిక్షణ అనంతరం పాలకొల్లు సమీపంలోని తన స్వగ్రామమైన గొల్లవానిచెరువులో తన స్వగృహం నుంచే స్క్రీన్ ప్రింటింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు.

1983 - 1992

లెటర్ ప్రెస్ - ఆఫ్‌సెట్ వైపు...

1983లో ‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ పేరుతో పాలకొల్లులో పూర్తిస్థాయి లెటర్ ప్రెస్ ప్రింటింగ్ యూనిట్‌ను స్థాపించి, ప్రింటింగ్ మార్కెట్‌లో అడుగుపెట్టారు.

నాణ్యతతో కూడిన పని, కష్టపడి పనిచేసే నిబద్ధత, ఖాతాదారులతో స్నేహపూర్వక సంబంధాలు - ఈ విలువల కారణంగా రత్న ప్రింటింగ్ వర్క్స్ అతి తక్కువ సమయంలోనే పాలకొల్లు పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ మంచి పేరు సంపాదించింది. శ్రీ రామారావు విద్య, సాంకేతిక అనుభవం సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి.

సాంకేతిక పరిణామాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలనే దృక్పథంతో 1992లో కొంతమంది మిత్రులతో కలిసి అప్పటికి ఆధునిక సాంకేతికతగా ఉన్న *డెస్క్‌ టాప్ పబ్లిషింగ్ (DTP)* తో కూడిన ఆఫ్‌సెట్ ప్రింటింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.

లెటర్ ప్రెస్‌లోని అనేక పరిమితులను అధిగమిస్తూ మెరుగైన నాణ్యతను అందించగలిగిన ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ద్వారా ‘రత్న ఆఫ్‌సెట్ ప్రింటర్స్’ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ ప్రాంతంలో ప్రారంభమైన తొలి కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్ యూనిట్ కావడం ఈ సంస్థ ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయి.

1997

విజయవాడలో సాంకేతిక ప్రయాణం

ప్రింటింగ్ రంగంలో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృత అనుభవాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో 1997లో శ్రీ రామారావు విజయవాడకు వెళ్లారు. అక్కడి ప్రముఖ ప్రింటింగ్ సంస్థ *‘భావన ఆఫ్‌సెట్ ప్రింటర్స్’* లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆ రోజుల్లో మల్టీకలర్ ప్రింటింగ్ ప్రధానంగా సింగిల్ కలర్ మెషిన్లతో నిర్వహించబడుతున్న సమయంలో, భావన ఆఫ్‌సెట్ ప్రింటర్స్‌ లో ‘Adast Dominant’ 2-Color Printing Machine‌ను తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది.

మాసపత్రిక

‘కంప్యూటర్ విజ్ఞానం’ - సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసే ప్రయత్నం

ప్రింటింగ్ రంగంతో పాటు రచనా వ్యాసంగం, కంప్యూటర్ సాంకేతికతపై ఉన్న ఆసక్తితో, అప్పుడప్పుడే ప్రజల్లోకి వస్తున్న కంప్యూటర్లను సామాన్య ప్రజలకు సైతం సులభంగా పరిచయం చేయాలనే సంకల్పంతో శ్రీ రామారావు తెలుగులో ‘కంప్యూటర్ విజ్ఞానం’ అనే మాసపత్రికను ప్రారంభించారు.

కంప్యూటర్లకు సంబంధించిన విషయాలను సరళమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యే విధంగా అందించిన ఈ పత్రిక అనేకమందికి మార్గదర్శకంగా నిలిచింది. ఒక దశలో 18,000 కాపీల సర్క్యులేషన్‌కు చేరుకోవడంతో పాటు, విదేశాల్లోనూ చందాదారులను సంపాదించుకోవడం విశేషం.

పత్రిక ప్రచురణకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడటంతో భావన ఆఫ్‌సెట్ ప్రింటర్స్‌ లోని బాధ్యతల నుంచి వైదొలగి, కొంతకాలం పూర్తిస్థాయిలో ‘కంప్యూటర్ విజ్ఞానం’ పత్రిక కోసం తన సమయాన్ని కేటాయించారు.

సాంకేతికత

అడ్మినిస్ట్రేషన్ల లో కంప్యూటరీకరణకు శ్రీకారం

తదుపరి కాలంలో విజయవాడలోని మరో ప్రముఖ సంస్థ *‘శ్రీలేఖ పవర్ ప్రింటర్స్’* లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లోని జాబ్ వర్క్స్ నిర్వహణ, కస్టమర్ డేటా తయారీ, నిర్వహణ వంటి అవసరాలకు ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయించి, ప్రింటింగ్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో కంప్యూటర్ల వినియోగానికి శ్రీకారం చుట్టారు. ఖాతాదారులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంలోనూ ఈ విధానం ఎంతో ఉపయోగపడింది.

2019

తిరిగి స్వగ్రామానికి - సాంకేతికతతో కొత్త ప్రయాణం

వ్యాపారాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా కూడా చూడాలనే ఆలోచనతో, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పెరుగుతున్న వలసల కారణంగా నగరాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో తన వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో శ్రీ రామారావు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు దశాబ్దాల క్రితం ఎక్కడైతే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారో, అదే స్వగ్రామమైన గొల్లవానిచెరువుకు తిరిగి వచ్చారు.

ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న నేటి పరిస్థితులను ఉపయోగించుకుని, మారుమూల గ్రామం నుంచే వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 2019లో తన కంప్యూటర్లు, ఇతర అవసరమైన సామగ్రితో స్వగ్రామానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. భౌగోళిక దూరం సేవలకు అడ్డంకి కాకుండా, ఇతర పట్టణాలు మరియు ఇతర రాష్ట్రాల్లోని ఖాతాదారులకు సైతం నాణ్యమైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు.

నమ్మకమే బలం

నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంలో మారినవి సాంకేతికతలు, ప్రింటింగ్ పద్ధతులు, యంత్రాలు. కానీ మారనిది మాత్రం నాణ్యత పట్ల మా నిబద్ధత, ఖాతాదారుల పట్ల మా బాధ్యత.

బాధ్యతాయుతమైన సేవ
నాణ్యత
సమయపాలన
పారదర్శకత
మర్యాదపూర్వక ప్రవర్తన

బాధ్యతాయుతమైన సేవ, నాణ్యత, సమయపాలన, పారదర్శకత, మర్యాదపూర్వక ప్రవర్తన అనే ఐదు ప్రధాన విలువలను ఆధారంగా చేసుకుని నేటికీ ‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ తన ఖాతాదారులకు నాణ్యమైన, నమ్మకమైన ప్రింటింగ్ సేవలను అందిస్తోంది.

రంగ సేవ

ప్రింటింగ్ రంగం అభివృద్ధిలో మా వంతు పాత్ర

ఒక చిన్న పల్లెటూరులో, ఒక రైతు కుటుంబంలో జన్మించి, అదే గ్రామం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి, తిరిగి అక్కడి నుంచే వ్యాపారం కొనసాగిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన శ్రీ ముత్యాల రామారావు, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ప్రింటింగ్ రంగానికి సేవలందిస్తున్నారు.

ప్రింటింగ్ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిణామాలపై ప్రింటర్లకు అవగాహన కల్పించే వివిధ సెమినార్లు, సాంకేతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, తన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని తోటి ప్రింటర్లతో పంచుకోవడం ద్వారా ప్రింటింగ్ రంగం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

1982లో ప్రారంభమైన ఒక చిన్న ప్రింటింగ్ యూనిట్ నుంచి, సాంకేతికతను తోడుగా చేసుకుని నాలుగు దశాబ్దాల ప్రయాణం సాగించిన ‘రత్న ప్రింటింగ్ వర్క్స్’ - నాణ్యతను ఎప్పటికీ రాజీపడని విలువగా భావిస్తూ, నమ్మకాన్ని తన చిరునామాగా చేసుకుని ముందుకు సాగుతోంది.

English

Four Decades of Continuous Endeavour

The journey of ‘Ratna Printing Works’, which began in 1982, has continued for more than four decades, built on the core values of quality, technology, trust, and reliable service.

The owner’s early interest in the printing industry, his constant eagerness to embrace new technologies, and his responsible approach towards customers have been the key strengths behind the growth and development of ‘Ratna Printing Works’.

40+
Years of service
1982
Journey began
Quality First
Never compromising quality
1982

A Journey that Began with Screen Printing

The journey of ‘Ratna Printing Works’ began in 1982 with Screen Printing. Immediately after completing his graduation, Sri Mutyala Ramarao went to Chennai with the objective of gaining professional expertise in the printing field. He underwent training in screen printing and subsequently worked for some time with reputed organizations such as ‘Rising Screens’ and ‘Koya Screens’, gaining valuable technical knowledge and practical experience.

After completing his training, he returned to his native village Gollavanicheruvu, near Palakollu and started screen printing operations from his own home.

1983 - 1992

From Letterpress to Offset Printing

In 1983, he established a full-fledged Letterpress Printing Unit in Palakollu under the name ‘Ratna Printing Works’, marking his formal entry into the printing market.

Quality workmanship, a strong commitment to hard work, and friendly relationships with customers helped Ratna Printing Works earn a good reputation within a very short period, not only in Palakollu but also in the surrounding areas. Sri Ramarao’s education and technical experience played a significant role in the growth of the organization.

With a strong desire to keep pace with technological advancements, in 1992, together with a few friends, he established an Offset Printing Unit equipped with Desktop Publishing (DTP), which was considered advanced technology at the time.

Offset printing helped overcome many of the limitations of letterpress printing while delivering improved quality. As a result, ‘Ratna Offset Printers’ established its own identity in the region. Being the first computerized printing unit in the area was another important milestone in the organization’s journey.

1997

A New Chapter in Vijayawada

With the objective of gaining greater exposure to advanced printing technologies and broader professional experience, Sri Ramarao moved to Vijayawada in 1997 and joined the reputed printing organization ‘Bhavana Offset Printers’ as its General Manager.

At a time when multicolour printing was predominantly carried out using single-colour machines, an ‘Adast Dominant’ 2-Color Printing Machine was introduced at Bhavana Offset Printers.

Magazine

‘Computer Vignanam’ – Bringing Technology Closer to the Common People

Alongside his involvement in the printing industry, Sri Ramarao had a keen interest in writing and computer technology. With a vision of introducing the emerging world of computers to the common people in a simple and accessible manner, he launched the Telugu monthly magazine ‘Computer Vignanam’ along with his friend Sri P.B. Srinivas.

By presenting computer-related subjects in simple Telugu that could be easily understood by everyone, the magazine became a useful guide for many readers. At one stage, it reached a circulation of 18,000 copies and also gained subscribers from overseas.

As publishing the magazine required considerable time and commitment, he stepped away from his responsibilities at Bhavana Offset Printers and devoted himself full-time to ‘Computer Vignanam’ for a period.

Innovation

Pioneering Computerization in Printing Administration

Later, he took charge as General Manager of another prominent Vijayawada-based organization, ‘Srilekha Power Printers’.

To meet the requirements of job-work management, customer data preparation and maintenance, specialized computer software was developed and introduced. This marked an important step towards using computers to manage printing operations more efficiently and to provide customers with the information they needed in a timely manner.

2019

Returning to His Native Village – A New Journey Powered by Technology

Viewing business not merely as a commercial activity but also from a social perspective, Sri Ramarao took an important decision with the intention of contributing in his own way towards reducing the growing pressure on cities caused by migration from rural areas.

He returned to the same native village, Gollavanicheruvu, where he had started his business journey four decades earlier.

Taking advantage of the modern technology available today, he made arrangements to continue his business operations from this remote village. In 2019, he returned to his native village with his computers and other essential equipment and has continued his operations from there.

Geographical distance has never been allowed to become a barrier to service. Today, customers from other towns and even other states continue to receive quality printing services from Ratna Printing Works, supported by modern technology.

Trust is Our Strength

Over the course of more than four decades, technologies, printing methods and machines have changed. But one thing has remained constant - our commitment to quality and our responsibility towards customers.

Responsible Service
Quality
Punctuality
Transparency
Courteous Conduct

Even today, responsible service, quality, punctuality, transparency, and courteous conduct remain the five core values that guide Ratna Printing Works in delivering quality and dependable printing services to its customers.

Industry Contribution

Contributing to the Growth of the Printing Industry

Born into a farmer’s family in a small village, Sri Mutyala Ramarao began his business journey from the same village and after decades of professional experience, returned to continue his business from there once again. By continuously embracing technology and evolving with the times, he has progressed step by step in his professional journey.

Today, he serves the printing industry as the Vice President of the Andhra Pradesh State Offset Printers Association.

He also participates in various seminars and technical programs, sharing his experience and knowledge with fellow printers and contributing to greater awareness of emerging technologies and developments in the printing industry.

From a small printing unit established in 1982 to a four-decade journey powered by technology, ‘Ratna Printing Works’ continues to move forward with quality as a non-negotiable value and trust as its identity.

Ratna Printing Works

Never compromising Quality...